నేలను తాయారు చేయడం :
వడగాల్పులను, పెనుగాలులు వీచే ప్రాంతాల్లో సరుగుడు, యూకలిప్టస్ మరియు ఎఱ్ఱ చందనం మొదలైనవి. గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో 2 మీటర్ల ఎడంలో నాటాలి.
నేలను 2 లేక ౩ సార్లు బాగా దున్ని, చదును చేసి 1*1*1 మీటర్ల గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతల్లో నాటడానికి ముందు 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు చెదలు రాకుండుటకుగాను 100 గ్రాముల ఫాలిడాల్ 2 శతం పొడిని త్రవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపి, 7-10 మీటర్ల దురాన నాటాలి. బాగా సారవంతమైన నెలల్లో 12 మీటర్ల దూరంలో కూడ నాటుకోవచ్చు.